24 June, 2026 | 4:53 AM

అక్షత్‌తో యాపిల్ సీఈవో భేటీ

11-06-2024 12:41 AM

న్యూయార్క్, జూన్ 10: యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్.. భారత్‌కు చెందిన విద్యార్థి అక్షత్ శ్రీవాస్తవను కంపెనీ హెడ్‌క్వార్టర్స్‌లో కలసి కాసేపు ముచ్చటించారు. 22 ఏళ్ల శ్రీవాస్తవ.. గోవాలోని బిట్స్ పిలానీ కేకే బిర్లా కాలేజీలో చదువుకుంటున్నారు. శ్రీవాస్తవ యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ కోడింగ్ చాలెంజ్‌లో విన్నర్‌గా నిలిచాడు. శ్రీవాస్తవ కోడింగ్ నైపుణ్యాన్ని మెచ్చిన టిమ్‌కుక్ అతడిని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడా రు. అనంతరం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘భారత్‌లో పర్యటిం చినప్పుడు ఎంతో మంది గొప్ప డెవలపర్లను కలిశాను. ప్రజల జీవితాలను టెక్నాలజీ పలు విధాలుగా స్పృశిస్తున్న విధానాన్ని చూసి ఎంతో ముచ్చటేసింది. అలాగే అక్షత్‌ను తాజాగా కలిసి మాట్లాడటం ఎంతో అద్భుతంగా అనిపించింది’ అని టిమ్‌కుక్ తెలిపారు.