24 June, 2026 | 6:03 AM

ఏపీలో కంపెనీలకు పండగే..

11-06-2024 12:40 AM

టీడీపీ అధికారంలోకి రావడంతో భారీగా పెరుగుతున్న షేర్ల విలువ

న్యూఢిల్లీ, జూన్ 10: ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నేతృ త్వంలోని టీడీపీ అధికారంలోకి రావడంతో ఏపీలోకి పలు కంపెనీల షేర్లు అమాంతం ఎగబాకాయి. గత నాలుగు రోజులుగా స్టాక్ మార్కెట్‌లో పలు కంపెనీల విలువ భారీగా పెరిగిపోయింది. కేసీపీ స్టాక్ మార్కెట్ షేర్ల విలువ ఏకంగా50 శాతం మేర పెరిగాయి. గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా ఎనర్జీ 32 శాతం మేర లాభాలు పొందాయి.

ఆంధ్రా షుగర్స్ కంపెనీకి 21 శాతం, అవంతి ఫుడ్స్‌కు 28 శాతం లాభాలు తెచ్చిపెట్టాయి.  లారస్ ల్యాబ్ 10 శాతం, నెల్‌కాస్ట్ 13 శాతం, కల్లం టెక్స్‌టైల్స్ 19 శాతం, విరాట్ క్రేన్ ఇండస్ట్రీస్ 23 శాతం, ఆంధ్రా సిమెంట్స్ 24 శాతం మేరక లాభాలు పొందాయి. ఇక హెరిటేజ్  ఫుడ్స్ కంపెనీ ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందు నుంచే లాభాల బాటలో పయనిస్తోంది. మార్చి క్వార్టర్ చివరకు 41.03 శాతం మేర లాభాలు పొందింది.