calender_icon.png 29 September, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ

29-09-2025 10:08:49 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని మద్యం దుకాణాలకు దరఖాస్తులను స్వీకరించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి అబ్దుల్ రజాక్ తెలిపారు. జిల్లాలోని మద్యం దుకాణాలకు సంబంధించి ఈరోజు ఏడు దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి రజాక్ తెలిపారు. ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 18వ తేదీతో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఒక్క దరఖాస్తులు మూడు లక్షల రూపాయల రుసుము ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైన వేయడాని అవకాశం ఉందన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలకు అక్టోబరు 23 న లక్కీ డ్రా నిర్వహించబోతున్నట్లు చెప్పారు.

47 మద్యం దుకాణాలకు సంబంధించి గౌడ కులస్థులకు మూడు, దుకాణాలు, ఎస్సీలకు ఐదు దుకాణాలు, ఎస్టీలకు ఒకటిగా రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. రిజర్వేషన్ కల్పించిన దుకాణాలకు దరఖాస్తు చేసుకునేవారు కుల దృవీకరణ పత్రంతో పాటు, మూడు లక్షల రూపాయల డిడి లేదా చలాన్ జతపరుచాల్సి ఉంటుందన్నారు. కుల దృవీకరణ పత్రం సమయానికి అందని పక్షంలో వారు నవంబరు 15 తేదీ వరకు అందజేయాల్సి ఉంటుందన్నారు. అండర్ టేకింగ్ పత్రం జతపరచాల్సి ఉంటుంది. డిడి లేద చలాన్లను "జిల్లా ప్రొహిబిషన్ మరియు ఏక్సైజ్ అధికారి, నిర్మల్" పేరున తీయాల్సి ఉంటుందని తెలిపారు.