calender_icon.png 30 September, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంప్రదాయ రీతిలో బతుకమ్మ వేడుకలు

29-09-2025 11:04:56 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో సోమవారం రాత్రి మహిళలు సాంప్రదాయ రీతిలో బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. తీరొక్క పూలతో అలంకరించిన రంగురంగుల బతుకమ్మలతో మహిళలు ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిభంభించేలా సాంప్రదాయ దుస్తులలో దేవాలయాల వద్ద కోలాటలాడారు. పలు కాలనీలలో మహిళలు వేడుకలను నిర్వహించి బతుకమ్మలను స్థానిక పోచమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. బతుకమ్మ పండుగ కోసం ఇళ్లల్లో సిద్ధం చేసిన సత్తు పిండిని ఒకరికొకరు పంచుకొని వాయినం ఇచ్చుకున్నారు. మహిళల కోలాటాల చప్పుళ్ళు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పాటల హోరు మధ్య బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా ముగిశాయి.