calender_icon.png 30 September, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బి.కె.గూడ జై భారతి హై స్కూల్ చౌరస్తా వద్ద సద్దుల బతుకమ్మ సంబరాలు

29-09-2025 10:49:53 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో బతుకమ్మ పండుగ ప్రత్యేక వేడుకలు సందడిగా జరుగుతున్నాయి. ఆ క్రమంలో బి.కె.గూడ జై భారతి హై స్కూల్ చౌరస్తా వద్ద సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. వందలాది మహిళలు సంప్రదాయ దుస్తుల్లో, అలంకరించిన బతుకమ్మలతో హాజరై సాంప్రదాయ పాటలతో ఆడిపాడుతూ తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేకతను ఆవిష్కరించనున్నారు. పూలతో చేసిన బతుకమ్మల చుట్టూ వలయాలు కట్టి ఆడే ఈ సంబరాలు అక్కడి ప్రాంత ప్రజలకు వినోదం, ఆధ్యాత్మికత కలిగించేలా ఉండనున్నాయి.

ఈ సందర్భంగా నిర్వాహకులు అకుల మహేష్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవంను ప్రతిబింబిస్తుందని, మహిళల పండుగగా, పూల పండుగగా ప్రతి ఇంటికి ఆనందం నింపుతుందని తెలిపారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా సమాజంలోని అన్నివర్గాలవారు పాల్గొని పూల విందు చేసుకోవాలని, సామాజిక ఐక్యతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరై పండుగ వేడుకలకు శోభను చేకూర్చనున్నారు. నిర్వాహకులు అన్ని మహిళలు, పిల్లలు, పెద్దలు కుటుంబ సమేతంగా పాల్గొని బతుకమ్మ పండుగ వైభవాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా నిలబెట్టాలని కోరుతున్నారు.