29-09-2025 11:23:27 PM
సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి..
నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి...
కోదాడ: కోదాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు కనుల పండుగగా జరిగాయి. మహిళల ఆటపాటలతో బాలుర ఉన్నత హై స్కూల్, గోపిరెడ్డి నగర్ మారు మోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని కోదాడ నియోజకవర్గ ప్రజలందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలంతా వివిధ రకాల పూలను, గౌరీదేవిగా ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. భారీగా తరలివచ్చిన మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు కోలాటాలతో ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ వంగవీటి రామారావు, చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఏ రమాదేవి డిఈ లక్ష్మి ఎర్నేని కుసుమ బాబు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, చింతకుంట్ల మంగమణి మల్లేశ్వరి నూనె సులోచన శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.