29-09-2025 10:51:07 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద సోమవారం సాయంత్రం నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ వేడుకలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరిశీలించారు. బతుకమ్మ ఆడే మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, ఏసీబీ రవికుమార్ లకు సూచించారు. బతుకమ్మ గాట్ వద్ద ప్రమాదాలు జరగకుండా మున్సిపల్ సిబ్బంది, గజ ఈతగాలను అందుబాటులో ఉంచినట్లు వారు ఎమ్మెల్యే వినోద్ కు సూచించారు. మహిళలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వినోద్ కాంగ్రెస్ నాయకులు ముచ్చర్ల మల్లయ్య, నా తండ్రి స్వామి, మునిమంద రమేష్ తదితరులు ఉన్నారు.