29-09-2025 11:14:43 PM
చిట్యాల (విజయక్రాంతి): సద్దుల బతుకమ్మ సందర్భంగా తీరొక్క పువ్వులతో చేసిన బతుకమ్మలను పరిశీలించి సోమవారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటం వెంకన్న బహుమతులను అందజేశారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా బీసీ కాలనీ లో ఏర్పాటు చేసిన బతుకమ్మలను పరిశీలించి ప్రకృతి సిద్ధంగా లభించే పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలను అభినందించి, ఆయన మహిళలకు నగదు అందజేశారు. తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చిన వారికి ప్రతి సంవత్సరం బహుమతులను అందచేస్తున్నామని, మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం తీరొక్క పూలతో బతుకమ్మలను కొలిచే సంప్రదాయం తెలంగాణ ప్రజలదని తెలిపారు.
ఈ సంవత్సరం సద్దుల బతుకమ్మను తొమ్మిది రకాల పూలతో చేసిన బతుకమ్మను మొదటి బహుమతిగా నీలకంఠం కావ్యను, ఎనిమిది రకాల పూలతో చేసిన బతుకమ్మను రెండవ బహుమతిగా శిలివేరు బిక్షపమ్మను ఎంపిక చేసి నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు నీలకంఠం లింగస్వామి, బుంగపట్ల తిమ్మయ్య, నీలకంఠం కిష్టయ్య వార్డు మహిళలు గుండేపూరి రాములమ్మ, నిలకంఠం కలమ్మ, తోటకూరి అండాలు, బుంగపట్ల లావణ్య, పోట్లపల్లి మమత తదితరులు పాల్గొన్నారు.