29-09-2025 10:47:03 PM
గుర్తించిన జిల్లా అధికారులు
ములుగు ఎస్పీ చేతుల మీదుగా క్యాష్ రివార్డ్
కన్నాయిగూడెం ప్రజలకు అండగా ఉంటా ఎస్సై ఇనిగాల వెంకటేష్
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఇనిగాల వెంకటేష్ విధి నిర్వహణలో నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రత్యేకమైన బాధ్యతతో ప్రజలకు మంచి కృషితో మమేకమైతు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో వారికి సాటి లేదు. ఎస్సై సకాలంలో సమస్యలు పరిష్కరించడంతో క్రైమ్ రిపోర్టు తగ్గించడంతో వారిని గుర్తించి ములుగు ఎస్పీ శబరిష్ చేతుల మీదుగా క్యాష్ వర్డ్ అందుకోవడం జరిగింది.
కన్నాయిగూడెం మండలంలో ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో తిరిగి నిత్యం వారికి సమాజం పట్ల విద్య ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ క్రైమ్స్ నిర్మూలించడంలో బాధ్యతగ పనిచేస్తున్న ఎస్సై వెంకటేష్, కన్నాయిగూడెం మండలంలో ఏక్కడ ఏమి జరుగుతుంది. అనేది ముందు ప్రణాళికతో ముందస్తు చర్యలు తీసుకోవడం. విద్యకు ప్రాధ్యాన తగిస్తూ వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం విద్యతో జయించే విజయాలను గురించి చెప్పడం. ఏజెన్సీ ప్రాంతంలో యూత్ పక్కదారిన పట్టకుండా విద్య పట్ల క్రీడలపరంగా అవగాహన కల్పిస్తూ గ్రామంలోని యూత్ వాలీబాల్ అందిస్తూ వారిని ప్రోత్సహించడంలో ముఖ్యపాత్ర పోసించారు.