23-01-2026 04:07:01 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఆధ్వర్యంలో పోటీ చేస్తే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరించారు. పార్టీ నిబంధనల ప్రకారం... స్థానిక కౌన్సిలర్ పదవుల కోసం ఆశావహుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా, 23వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మహ్మద్ అజారుద్దీన్ నేడు తన దరఖాస్తును సమర్పించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, వార్డు అభివృద్ధి ధ్యేయంగా ఆయన ఈ దరఖాస్తును అందజేశారు. ఈ దరఖాస్తును ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా సయ్యద్ హైదర్ మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు అండగా నిలిచే అభ్యర్థులను ప్రోత్సహిస్తామని, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.