23-01-2026 03:55:13 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామస్థాయి సీఎం కప్ ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో సరస్వతి మాత పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. గ్రామ పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయుల సమక్షంలో చిన్నారి విద్యార్థులు సరస్వతి మాత పూజా శ్లోకాలను పఠించి విద్యాదేవిని ప్రార్థించారు.
అనంతరం గ్రామస్థాయి సీఎం కప్ ఆటల పోటీలు గౌరవనీయ గ్రామ సర్పంచ్ అంచ శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో, గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో అధికారికంగా ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని, శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంచ శ్రీనివాస రెడ్డి, ఉపసర్పంచ్ జగ్గాని రాజేశం, వార్డు సభ్యులు సావనపెల్లి బాలయ్య, రేగుల, క్యారం పర్శరాములు, కుర్మ రాజన్న, తుమ్మల కనకయ్య, రేగుల శీను, పెంటల ముత్తయ్య, రోండ్ల మధు, గర్రిపెల్లి సతీష్, ప్రధాన ఉపాధ్యాయుడు రాజు, పాల్గొన్నారు. అలాగే గ్రామ సెక్రటరీ సంతోష్, పాఠశాల శ్రేయోభిలాషులు విద్యార్థులను ఉత్సాహంగా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.