23-01-2026 04:09:40 PM
ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి
అంతర్గాం తహశీల్దార్ తూము రవీందర్ పటేల్
అంతర్గాం,(విజయక్రాంతి): ఓటు హక్కు ప్రతి పౌరుడు బాధ్యత అని అంతర్గం తాహాశీ ల్దార్ తుము రవీందర్ పటేల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విద్యార్థుల చేత జాతీయ ఓటర్ దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తా వద్ద ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా అంతర్గాం తహశీల్దార్ మాట్లాడుతూ.... 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం వారి హక్కు అని కావున ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు మన ఆయుధం, ఓటు హక్కు వినియోగించుకోవడం మన హక్కు అనే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తూము రవీందర్ పటేల్, డిప్యూటీ తహశీ ల్దార్ మల్యాల తిరుపతి, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఎ. సుమలత, గిరిధవార్లు సడెంక శ్రీమాన్, సెర్వేర్ లలిత, ఎంపిఎస్ఒ మల్లెపెల్లి శైలజ, ఆపరేటర్ పులి సతీష్, జి.వేణు, జి పి ఒ, జి పి ఒ జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ స్వామి, వివిధ గ్రామాల జి పి ఒ లు న్యాతారి వినోద, బి. పుష్పలత, పి. రాజకుమార్, ఎన్. శ్రీనివాస్, కె. పోచం, జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ శోభ, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.