25-12-2025 12:12:28 AM
సిద్దిపేట, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న సాంఘీక, గిరిజన, వెనుకబడిన సంక్షేమ శాఖల, సాధారణ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5నుండి 9వ తరగతి ప్రవేశం కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కోఆర్డినేటర్ డా.శారద వెంకటేష్ తెలిపారు. జనవరి 21 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
సిద్దిపేట జిల్లా పరిధిలో 8 బాలురు, 8 బాలికల పాఠశాలలు ఉన్నాయని ఆసక్తి కలిగిన తల్లిదం డ్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికైన విద్యార్థులకు ఇం టర్ వరకు ఉచిత భోజన వసతితో పాటు నాణ్యమైన విద్యను అందిస్తామని తెలిపారు.