25-11-2025 06:14:51 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలంలోని గర్ల్స్ హాస్టల్(టిజీఎమ్ఎస్) గర్రెపల్లి నందు అసిస్టెంట్ కుక్ గా పనిచేయుటకు ఆసక్తిగల మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని మండల విద్యాధికారి రాజయ్య మంగళవారం తెలిపారు. సుల్తానాబాద్ మండలమునకు చెందిన ఎస్సీ కేటగిరికి చెందిన వారై, ఏడవ తరగతి ఉత్తీర్ణత సాధించి 25 నుండి 55 సంవత్సరాల వయసు వారు అర్హులు. పైన తెలిపిన అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు రేపటినుండి 26/11/2025 నుండి 30/11/2025 వరకు భూపతిపూర్ కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయంలో స్పెషలాఫీసర్ నకు దరఖాస్తులు సమర్పించవలసినదిగా మండల విద్యాధికారి రాజయ్య తెలియజేయడం జరిగింది. మరిన్ని వివరాలకు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం భూపతిపూర్ నందు సంప్రదించగలరు అని తెలిపారు.