calender_icon.png 25 November, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్పీ: సునిత రెడ్డి

25-11-2025 07:37:04 PM

వనపర్తి శాంతి–అభివృద్ధి లక్ష్యంగా పరస్పర సమన్వయం..

శాంతి భద్రతలపై కీలక చర్చలు.. ఎస్పీ, కలెక్టర్ సమావేశం..

వనపర్తి క్రైమ్: వనపర్తి జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సునిత రెడ్డి ఐపీఎస్ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా శాంతి భద్రతలు, నేర నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించుకున్నారు. రెవెన్యూ, పోలీసు విభాగాల పరస్పర సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని ఇద్దరు అధికారులు నిర్ణయించారు.

రోడ్డు ప్రమాదాల తగ్గింపు, యువతలో చట్ట అవగాహన కార్యక్రమాలు, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యల పరిష్కారంలో వేగవంతమైన స్పందనకు కట్టుబడి పనిచేస్తామని నూతన ఎస్పీ తెలిపారు. జిల్లా శాంతి, అభివృద్ధి లక్ష్యంగా అధికార వ్యవస్థ కలిసి పనిచేయనుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఐఏఎస్ పేర్కొన్నారు.