25-11-2025 07:29:58 PM
జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి..
వనపర్తి టౌన్: మంగళవారం రోజు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆర్. అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో గోపాల్పేట మండలం బుద్ధారం, చాకలిపల్లి రేవల్లి మండలం నాగపూర్ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాకాసి లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్లో దిగుబడి అయిన వరి ధాన్యానికి తగినన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే బుద్ధారం కొనుగోలు కేంద్రంలో దొడ్డు వడ్లను దాదాపు 40 రోజులుగా అనేక మంది రైతులు సొంత పని వదిలేసుకొని కాంటా కొరకై ఎదురుచూడడం దారుణమని కొనుగోలు కేంద్రాలలో రైతులకు కనీస అవసరాలు తాగడానికి మంచినీరు ఒక టెంట్ కూడా వేయలేని అధ్వాన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని సుత్తిలి దారం దబ్బునం కూడా రైతులే భరిస్తున్నారని కాంటాలు చేయాలంటే సిబ్బందికి రైతులు డబ్బులు ఇవ్వాల్సివస్తుందని ఇది కాంగ్రెసు మార్కు ప్రజా పాలనకు అద్దం పడుతుందని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రవాణాకు లారీలు అందుబాటులో లేవని రైస్ మిల్లర్లు సకాలంలో ధాన్యాన్ని దించుకోకపోవడంతో లారీలు ఓనర్లు నిరాకరిస్తున్నారని వెంటనే కలెక్టర్ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు తగు చర్యలు తీసుకొని నెలల తరబడి కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని కాంటాచేసి రైతులను ఆదుకోవాలని లేనిపక్షంలో రైతులతో కలిసి భారతీయ జనతా పార్టీ ఆందోళన నిర్వహిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాకాసి లోకనాథ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు జిల్లా కోశాధికారి బండారు కుమారస్వామి బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రాకాసి అరవింద్ రెడ్డి నాయకులు కృష్ణ జమ్ములు శ్రీశైలం పరశురాము తదితరులు పాల్గొన్నారు.