25-11-2025 07:39:58 PM
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో తనదైన ముద్ర
సీఎంఆర్ఎఫ్ చెక్కు కావాలంటే ఎల్ఐసి బీమా చేయాలని గుసగుసలు
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ దంతాలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిర్లక్ష్యం వల్ల సీఎంఆర్ఎఫ్ చెక్కు వెనక్కి ఈ ఘటన దంతాలపల్లి మండల గ్రామ పంచాయతీలో తాళ్ల లచ్చమ్మ(60) తన ఆరోగ్యం రిత్య కంటి ఆపరేషన్ చేయించుకోగా, ఆ హాస్పిటల్లో రూ.50 వేల వరకు ఖర్చు అయినాయి. సంబంధిత గ్రామపంచాయతీలో ప్రజలు మీరు సీఎంఆర్ కోసం మీకు ఎంతో కొంత డబ్బులు వస్తాయని, చెప్పడంతో బాధిత మహిళ లచ్చమ్మ తన హాస్పిటల్ బిల్లులు తీసుకొచ్చి సీఎంఆర్ కోసం అప్లై చేయడం జరిగింది.
అనంతరం 25 6 2025 తారీఖున తనకు చెక్కు మంజూరు అయినట్టు తన ఫోన్ నెంబర్ కు మెసేజ్ రావడంతో ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసింది. 10.7.2025న డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్, క్యాంపు కార్యాలయం నుండి దంతాలపల్లి మండల కేంద్రానికి చెక్కును సిఫారసు చేయడం జరిగింది. కానీ ఆ చెక్కును లచ్చమ్మ లబ్ధిదారునికి అందజేయాల్సిన బాధ్యతను మండల అధ్యక్షుడు నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆ వృద్ధురాలు నాకు విషయ మార్పు చెక్కు రావట్లేదని సంబంధిత గ్రామపంచాయతీలో సమాచారం సేకరిస్తుంటే గ్రామపంచాయతీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు మీకు నాలుగు రోజుల్లో చెక్ వస్తుంది మీరు ఆధార్ కార్డు పట్టుకొని సంబంధిత మండల కేంద్రం నందు ఎమ్మెల్యే రామచంద్రనాయక్ చేతుల మీదుగా సీఎంఆర్ చెక్కు తీసుకోవాలని సూచించడం జరిగింది. అనంతరం 24 11 225 తారీఖున ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కు తీసుకొని ఆ మండల కేంద్రంలో బ్యాంకుకు వెళ్లగా మీ సీఎం అఫ్ చెక్కు డేట్ అయిపోయిందని బ్యాంకు అధికారులు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది.