calender_icon.png 25 November, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయం స్థాయి IIC రీజినల్ మీట్‌కి ఆతిథ్యం ఇచ్చిన GRIET

25-11-2025 07:23:56 PM

450 ఇన్నోవేషన్ అంబాసిడర్లు, 600 మంది విద్యార్థులు యుక్తి ఇన్నోవేషన్ చాలెంజ్‌లో ప్రతిభ ప్రదర్శన

AICTE, MoE, TSCHE నిపుణులు యువతలో పరిశోధన, ఆవిష్కరణల ప్రాధాన్యాన్ని తెలియజేసిన సమావేశం

దేశవ్యాప్తంగా కేవలం ఎనిమిది సంస్థలకు లభించిన గౌరవం-ప్రతిష్టాత్మక IIC రీజినల్ మీట్ నిర్వహణ హక్కులు పొందిన GRIET

హైదరాబాద్: IIC రీజినల్ మీట్ 2025 కార్యక్రమం GRIET IIC ఇన్‌చార్జ్ డా. రామసుందరి నివేదికతో ప్రారంభమైంది. ఆమె AICTE, విద్యా మంత్రిత్వ శాఖ(MoE), తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా GRIETలో కొనసాగుతున్న ఇన్నోవేషన్ కార్యక్రమాలను వివరించారు. తొలి సంవత్సరానికే GRIET–IIC 5-స్టార్ రేటింగ్ సాధించడాన్ని సంస్థలోని బలమైన ఇన్నోవేషన్ ఎకోసిస్టంకి నిదర్శనంగా పేర్కొన్నారు.

GRIET విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేందుకు TEDx, E-Talks, G-Talks వంటి వేదికలు, అలాగే 3D ప్రింటింగ్, చిప్ డిజైన్, GISMO బోర్డు డిజైన్ వంటి సదుపాయాలతో కూడిన ఐడియా ల్యాబ్ పనిచేస్తోందని చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన GRIET డైరెక్టర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కేవలం 8 కేంద్రాల్లో ఒకటిగా ఈ మీట్ నిర్వహణ గౌరవం GRIET‌కు లభించడం ఎంతో గర్వకారణమని అన్నారు. భారత్ ప్రస్తుతం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 38వ స్థానంలో ఉందని, 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో ఇన్నోవేషన్ కీలకమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 1.5% బడ్జెట్‌ను R&Dకు కేటాయిస్తున్నామని తెలిపారు.

గెస్ట్ ఆఫ్ హానర్ శ్రీ బీమలింగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, యుక్తి ఐడియా రిపాజిటరీలో ప్రస్తుతం 2.5 లక్షల ఐడియాలు నమోదయ్యాయని, తెలంగాణలోని IDEA Labs విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలు అందిస్తున్నాయని అన్నారు. TSCHE సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ తయారీ రంగం బలపడడమే భారత్ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. T-Works AVP అదిత్య రవిశంకర్ ఆధునిక ప్రోటోటైపింగ్ సాంకేతికతలు విద్యార్థుల ఆలోచనలను వాస్తవ రూపంలోకి తేవడానికి సహకరిస్తున్నాయని, విఫలాలను భయపడకుండా ముందుకు సాగాలని సూచించారు.

ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించిన AICTE ఛైర్మన్ ప్రొఫెసర్ సీతారాం సంస్థల వార్షిక టర్నోవర్‌లో 5% R&Dపై ఖర్చు చేయాలని సూచించారు. దేశంలో 16,400 IICs ఉన్నప్పటికీ, యుక్తిలో ఇంకా మరిన్ని ఐడియాలను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇకపై సంస్థల్లో R&D సెల్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. TSCHE ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి నేటి యుగం నాలెడ్జ్ రేవల్యూషన్ కాలమని, భారత్ ప్రపంచ యువశక్తిగా ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో Academic Social Responsibility (ASR) అనుసరించడం అవసరమని తెలిపారు. వాలెడిక్టరీ సెషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పంకజ్ దివాన్, విద్యార్థుల్లో ఆంత్రప్రెన్యూరియల్ ఆలోచనలను వెలికితీయడం గురువుల బాధ్యత అని చెప్పారు. ఇన్నోవేషన్‌ను ఒక రోజువారీ సంస్కృతిగా మార్చాలని సూచించారు.

అవార్డులు:

– బెస్ట్ పోస్టర్ అవార్డులు: వర్ధమన్ ఇంజినీరింగ్ కాలేజ్, GRIET, భారతీయ విద్యా భవన్, CMRIT.

– బెస్ట్ ఇన్నోవేషన్ అంబాసడర్ అవార్డులు: BEIT, GPTCET, St. Joseph’s, MJCET, GCET, VCE, మహావీర్, MRITS, SVIT, MLRIT, AVNET, GNIT, VBIT, GNITC, VCE అధ్యాపకులకు.

– బెస్ట్ స్టాల్ సర్టిఫికేట్లు: బంధార్ కలంకారి హౌస్, శ్రీ ఎథినిక్స్, వేస్ట్ వర్క్స్, హౌస్ ఆఫ్ స్వాషా, ఈకో-ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ స్టాల్.

కార్యక్రమం వోటు ఆఫ్ థ్యాంక్స్‌తో డా. ఎస్. గోవింద్ రావు ముగించారు.