25-11-2025 07:14:13 PM
కోదాడ: షాది ఖానాకు రెండు ఎకరాల స్థలం నిర్మాణము ఈద్గా నిర్మాణాలకు కలిపి ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఉత్తమ్ దంపతుల ఫ్లెక్సీకి మంగళవారం ముస్లిం నాయకులు పాలాభిషేకం చేశారు. ముఖ్యంగా షాది ఖానా నిర్మాణం అనేది కోదాడ నియోజకవర్గం కోదాడ టౌన్ మైనారిటీల కల ఎన్నో సంవత్సరాల నుండి కంటున్న కల కలగానే మిగిలిపోతున్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి చొరవతో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వెంటనే స్పందించి ముస్లిమ్స్ కు షాది ఖానా అనేది ఎంతగానో అవసరమని మంజూరు చేయించిన ఘనత వారికి దక్కుతుందని అన్నారు.
నిధులు మంజూరు చేయించినందుకు వారికి ముస్లిం సోదరులందరూ ఎప్పటికీ ఎప్పటికైనా రుణపడి ఉంటారని పలువురు అభినందనలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం పరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మైనార్టీలకు పెద్దపీట వేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ టౌన్ కిసాన్ సెల్ అధ్యక్షులు ముస్తాఫా, కోదాడ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాబా, మాజీ కౌన్సిలర్ రెహన, ఉద్దండ యూత్ నాయకులు మహమూద్ అజీమ్ కమల్.జానీ.అబ్దుల్ రహీం పాల్గొన్నారు.