25-11-2025 06:17:03 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని యాపల్ గూడ 2వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్‌గా వెంకట్ రాములు బాధ్యతలు స్వీకరించారు. బెటాలియన్ ప్రస్తుత కమాండెంట్ గా పని చేస్తున్న నీతిక పంత్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీ అవ్వడంతో ఆమె స్థానంలో రాములు మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కమాండెంట్ కు సీనియర్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అటు దళాల శిక్షణ, క్రమ శిక్షణ, ప్రజా భద్రత మన ప్రాధాన్యత అని నూతన కమాండెంట్ రాములు పేర్కొన్నారు. బెటాలియన్ ప్రతిష్టను మరింతగా పెంచేలా సమిష్టిగా పనిచేద్దాం అని సూచించారు. ఇప్పటివరకు పోలీసు శాఖలో పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తూ తన అనుభవం, నాయకత్వం బెటాలియన్ అభివృద్ధికి, దళాల సామర్థ్య వృద్ధికి ఎంతో తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.