calender_icon.png 25 November, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోలూర్ లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభం

25-11-2025 07:41:36 PM

తానూర్ (విజయక్రాంతి): ​మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు, మహిళలకు ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరల కార్యక్రమాన్ని మంగళవారం మండలంలోని కోలూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రారంభించారు. స్థానిక మాజీ సర్పంచ్ నాయకులతో కలిసి ఈ చీరల పంపిణీని చేపట్టారు. ​ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కాంతాల చంద్రకళ, శ్రీనివాస్ రెడ్డి, ఎం. శంకర్, నాయకులు కె. సురేష్ పటేల్, బి. మాధవరావు, ఐకేపీ సీసీ సరస్వతీ, ఇందిరామ్మ కమీటి సభ్యులు షేక్ లాల్ పాషా, ధర్మేందర్, కోలూర్ గ్రామ వీవోఏ అధ్యక్షురాలు బి. శోభాబాయి, ఉపాధ్యక్షులు బి. శేశాబాయి, కోశాధికారి అనుషాబాయి, సాగర్ బాయి, కారో బారి నర్సారెడ్డి, ఐకేపీ సీఎ ముత్యం, గ్రామస్తులు బి. రాజు, నగేష్, డి. శంకర్, షేక్ షౌకత్, సుశీల్ కుమార్, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.