24-01-2026 03:44:02 PM
ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలి
జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎం. నగేష్
మెదక్,(విజయక్రాంతి): గ్రూప్ 1,2,3,4, ఆర్ ఆర్ బి, ఎస్ఐ , కానిస్టేబుల్, ఎస్ ఎస్ సి తదితర పోటీ పరీక్షలకు స్థానిక టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫౌండేషన్ కోర్సు ద్వారా 5 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎం నగేష్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి సింధు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ బి.శ్రీకాంత్ లతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 30 వ తేదీ వరకు దరఖాస్తు లను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లా లోని డిగ్రీ పూర్తి చేసి 3 లక్షల లోపు ఆదాయం కలిగిన ఎస్సీ బీసీ, ఎస్టీ అభ్యర్థులు ఆన్లైన్ లో tsstudycercle. co.in లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 8 న సిద్దిపేట ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఎంట్రన్స్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా, మెరిట్ ఆదరంగా ఎస్సీలకు 75, బీసీ లకు 15 , ఎస్టీ లకు 10 శాతం సీట్లు కేటాయిస్తారని చెప్పారు ఇందులో ఫిజికల్ హ్యాండీక్యాప్ అభ్యర్థులకు 5, మహిళా అభ్యర్థులకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పారు 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి 5 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ తో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.