calender_icon.png 24 January, 2026 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు

24-01-2026 03:41:30 PM

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్  మాట్లాడుతూ బాలికల విద్య  సమాజ భవిష్యత్ బాలిక సాధికారత – దేశాభివృద్ధి అనే అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.

బాలికల విద్య ప్రాముఖ్యత, హక్కులు, భద్రత, ఆత్మవిశ్వాసం వంటి అంశాలపై ప్రసంగాలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల  ప్రిన్సిపాల్ బాలసాని శ్రీనివాస్ , ఎన్ఎస్ఎస్  ప్రోగ్రాం ఆఫీసర్ శ్రావణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బాలికలను చదివిద్దాం – సమాజాన్ని ముందుకు నడిపిద్దాంఅనే సందేశంతో ఈ కార్యక్రమం ముగిసింది.