calender_icon.png 7 October, 2025 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం దుకాణాలకు 35 దరఖాస్తులు

07-10-2025 12:00:00 AM

నిజామాబాద్ అక్టోబర్ 6: (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో మద్యం టెండర్లు దరఖాస్తుల ప్రక్రియ మొదలైన అప్పటినుండి సోమవారం వరకు అనగా 06.10.2025, మద్యం షాప్ ల దారాఖాస్తుల ప్రక్రియ 2025-2027 సంవత్సరానికి గాను మద్యం దుకాణాల కొరకు మొత్తం 35 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ స్టేషన్ ఫరిది లో మొత్తం 36 వైన్ షాప్లకు గాను 11 దుఃఖాలకు లకు 18 దరఖాస్తులు వచ్చాయి.

బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం18 వైన్ షాప్లకు గాను 4 మద్యం దుకాణాలకు 5 దరఖాస్తులు వచ్చాయి. ఆర్మూర్ స్టేషన్  పరిధిలో మొత్తం 25 వైన్ షాప్లకు గాను 4 షాప్ లకు 5 దరఖాస్తులు వచ్చాయి. భీంగల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ షాప్లకు గాను 3షాప్ లకు 4 దరఖాస్తులు వచ్చాయి. మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 వైన్ షాప్లకు గాను 2 షాప్ లకు 3 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం వరకు నిజామాబాద్ జిల్లాలో 102 వైన్ షాప్ లకు గాను 24 షాప్ లకు 35 దరఖాస్తులు వచ్చయి.