07-10-2025 07:27:23 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీలో కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి మంగళవారం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కే. విజయ్ కుమార్ మాట్లాడుతూ... సమాజానికి కొమురం భీమ్ చేసిన సేవలను, పోరాటాలను స్మరిస్తూ జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఉద్యమించడం జరిగిందన్నారు. చివరకి కుర్డూ పటేల్ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన తప్పుడు సమాచారంతో జోడేఘాట్ అడవుల్లో మరణించడం జరిగిందని అని గుర్తు చేసారు. ఈ కార్యక్రమములో మేనేజర్ కే. రాజశేఖర్, ఆర్.ఐ టి. రాజశేఖర్, టిపిఎస్ శ్యామ్ సుందర్, సానిటరీ ఇన్స్పెక్టర్, కందుల రాజేష్, కార్యాలయల సిబ్బంది పాల్గొన్నారు.