07-10-2025 12:00:00 AM
నిజామాబాద్, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం నగరంలో నీ పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అక్రమంగా ఎండు గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం సమాచారం మేరకు నగరంలో పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించగా 7.700 కిలోల ఎండు గంజాయి తో పాటు ముగ్గురిణి పట్టుకున్నారు. అందులో ఓ మైనర్ బాలుడితో పాటు సిరికొండకు చెందిన వంశీ, తరుణ్ లను అరెస్ట్ చేశారు.
ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు. అయితే నిషేధిత అక్రమ ఎండు గంజాయి తరలింపులో పోలీస్ అధికారులకు ఏమాత్రం అనుమానం కలగకుండా ఇతర రాష్ట్రాల నుండి గంజాయి తరలింపులో మైనర్లను బలి పశువులుగా గంజాయి ముఠా సభ్యులు కొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టారనే విషయం ఈ తనిఖీల్లో తేతటేల్లమైందని అధికారులు పేర్కొన్నారు. ఈ సోదాలో ఎస్త్స్ర బి.రామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.