calender_icon.png 7 October, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహా ఋషి వాల్మీకి..

07-10-2025 07:46:05 PM

ఘనంగా మహర్షి జయంతి వేడుకలు..

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం వాల్మీకి నగర్ లో వాల్మీకి  దేవాలయంలో మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలకు వివిధ పార్టీలకి చెందిన నాయకులు, పట్టణ ప్రముఖులు, భక్తులు హాజరై ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి సంస్కృత ఆదికవి అని అన్నారు. రామాయణ మహాకావ్యాన్ని రచించి ప్రపంచానికి చాటి చెప్పిన జ్ఞాన నిధి వాల్మీకి మహర్షి అని, వాల్మీకి గొప్ప ఖగోళ వేత్త అని తెలిపారు. మరోవైపు తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ యాదగిరి ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి చిత్రపటానికి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి మహర్షిగా మారిన మహోన్నతుడు వాల్మీకి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.