calender_icon.png 7 October, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై రేపు హైకోర్టులో విచారణ

07-10-2025 07:41:50 PM

హైదరాబాద్: తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9ను అమలు చేసింది.  జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే బీసీల 42 శాతం రిజర్వేషన్ల పిటిషన్లపై బుధవారం తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం విచారణ జరుపనున్నారు. ఈ అంశంపై  హైకోర్టు ఏ నిర్ణయం వెల్లడిస్తుందన్న దానిపై తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు, బీసీ సంఘాల నేతల్లో ఉత్కంఠత నెలకొంది. జీవో 9ని హైకోర్టు కొట్టివేస్తుందా.? సమర్థిస్తుందా.? రెండు పిటిషన్లపై విచారించనున్న ధర్మాసనం పిటిషనర్లపై ప్రత్యేక బెంచ్‌ ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు.