05-08-2025 01:47:05 AM
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): విద్యార్థుల్లో దాగివున్న ప్రతి భను వెలికి తీసి.. పరిశోధనలవైపు ప్రోత్సహించేలా ప్రమోషన్ ఆఫ్ రీసె ర్చ్ ఆటిట్యూడ్ ఇన్ యంగ్ అండ్ ఆ స్పైరింగ్ స్టూడెంట్ (ప్రయాస్) పథ కం దరఖాస్తుల స్వీకరణకు కేంద్రం ఆగస్టు 17ను చివరి తేదీగా నిర్ణయించింది.
ఆసక్తి గల పాఠశాలలు ప్ర యాస్ పథకం కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు త మ స్థానిక సమస్యలను గుర్తించి, దానికి శాస్త్రీయ పరిష్కారాన్ని చూపా ల్సి ఉంటుంది. ఈ పథకం కింద 20 25 26 విద్యాసంవత్సరానికి 9 నుంచి 11వ తరగతులు చదువుతు న్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పథకానికి ఎంపికైన వారి కి రూ.50 వేల ప్రోత్సాహక గ్రాంట్స్‌ను విద్యాశాఖ ఇస్తోంది. ఎం పికైన వారు వచ్చే ఏడాది అక్టోబర్ 20లోగా రిపోర్ట్‌ను సమర్పించాలి.