13-07-2024 12:39:29 AM
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 546 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 115, పౌరసరఫరాల శాఖకు 79, విద్యుత్ శాఖకు 50, గృహ నిర్మాణ శాఖకు 64, మైనార్టీ సంక్షేమ శాఖకు 41, ఇతర శాఖలకు 197 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు.