calender_icon.png 26 December, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండ బీజేపీలో డిష్యుం డిష్యుం

26-12-2025 02:26:29 AM

నాగం వర్షిత్‌రెడ్డి x పిల్లి రామరాజు 

  1. వాజపేయి జయంతి సాక్షిగా నేతల ముష్టియుద్ధం
  2. పార్టీ ఆఫీసులో  రామరాజుపై వర్షిత్‌రెడ్డి వర్గీయుల దాడి
  3. జర్నలిస్టులపైనా దౌర్జన్యం

నల్లగొండ టౌన్, డిసెంబర్ 25: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సాక్షిగా గురువారం బీజేపీ నల్లగొం డ జిల్లా కార్యాలయంలో బీజేపీ నేతలు కుమ్ములాటకు దిగారు. నల్లగొండ నియోజకవర్గంలో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచు లు, వార్డు సభ్యులకు పార్టీ తరఫున సన్మానించాలని నాయకులు పిల్లి రామరాజు ఈ విష యాన్ని జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు స్థానిక నేతలు తెలిపా రు. ఇందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడన్నా రు. వెంటనే పిల్లి రామరాజుసన్మానం సంబంధించిన ఏర్పాట్లు చేయగా బుధవారం రాత్రి 11 గంటల తర్వాత సన్మాన సభను వాయిదా వేయాలని పిల్లి రామరాజుకు జిల్లా అధ్యక్షుడు నాగం ఆదేశించాడని తెలిపారు.

అయితే గురువారం అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి   మొదటగా జిల్లా అధ్యక్షులు, తదితరులు పూల మాల వేశారు. తర్వాత పిల్లి రామరాజు తన అనుచరులతో కలిసి విగ్రహానికి పూలమాల వేసి కార్యాలయంలోనే కూర్చున్నారు. ఇంతలో జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి కల్పించుకొని పార్టీ కార్యాలయంలో ఉన్న సర్పం చులు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులకు సన్మానం చేద్దామని ఇక్కడ ఉన్న నాయకులతో చెప్పారు. అదే సమయంలో పార్టీ నాయకులు పిల్లి రామరాజు కల్పించుకొని అందరికీ సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు సన్మానం చేయడం తగదు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును పిలిచి పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేద్దామని సూచించారు.

వెంటనే నాగం వర్షిత్ రెడ్డి వర్గీయు లు కల్పించుకొని ఆకస్మికంగా దాడికి దిగడంతో పిల్లి రామరాజుకు గాయాల య్యాయి. ఆ సమయంలో అక్కడ జరుగుతున్న ఘర్షణను జర్నలిస్టులు తమ కెమెరా లలో రికార్డ్ చేసిన విషయాన్ని గమనించిన నాగం వర్షిత్ రెడ్డి వారి కెమెరాలు లాక్కొని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశారు. దీనికి నిరసనగా పలువురు జర్నలిస్టులు బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వర్షిత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన జర్నలిస్టులకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దు మణిగింది.

జిల్లా అధ్యక్షుడిని మార్చాలి : పిల్లి రామరాజు

 పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకులను కలుపుకొని పోకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని వెంటనే మార్చాలని పిల్లి రామరాజు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీఅధ్యక్షుడిగా ఏ ఒక్కరికి సహకారం అందించలేదని, తానే రాత్రనకా, పగలనక కష్టపడి ప్రచారం చేశానన్నారు.రాష్ట్రంలో బీసీ ఉద్యమం నడుస్తున్న తరుణంలో తనకు అవకాశం వస్తుందని అక్కసుతోనే వర్షిత్ రెడ్డి తనపై దాడికి పాల్పడుతూ తన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కాగా బీజేపీ సీనియర్ నేత గోలి మధుసూదన్ రెడ్డి వివాదం పెద్దది కాకుండా చర్యలు చేపట్టడం గమనార్హం.