11-12-2025 02:35:18 PM
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): జిహెచ్ఎంసి వార్డుల డీలిమిటేషన్ అస్తవ్యస్తంగా చేశారని బిజెపి మండల మాజీ ఉపాధ్యక్షుడు బచ్చు మల్లారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేడ్చల్ పట్టణంలో రెండు డివిజన్లు ఏర్పాటు చేసి ఒక డివిజన్ కు కిష్టాపూర్ పేరు పెట్టడం సరైనది కాదన్నారు. జనాభాపరంగా, విస్తీర్ణంగా పెద్దదైన పూడూరు డివిజన్ ఏర్పాటు చేస్తే బాగుండేది అన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. అధికారులు వెంటనే 298 పూడూరు డివిజన్ ఏర్పాటు చేయాలన్నారు.