calender_icon.png 11 December, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

11-12-2025 02:33:57 PM

81 జీపీలకు, 514 వార్డులకు ఎన్నికలు

77.34 శాతం పోలింగ్ నమోదు

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 90 గ్రామ పంచాయతీలుండగా ఆరు జీపీలు ఏకగ్రీవం కావడం, మూడు జీపీలకు నామినేషన్ లు వేడకపోవడంతో 81 గ్రామ పంచాయతీలకు గురు వారం మెదటి విడుత పంచాయితీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. మంచిర్యాల నియోజక వర్గంలోని హాజీపూర్ మండలంలోని 12 జీపీలకు, లక్షెట్టిపేటలోని 18 జీపీలకు, దండేపల్లిలోని 31 జీపీలలో కొండాపూర్, కొత్తమామిడిపల్లి, పాత మామిడిపల్లి, ముత్యంపేట జీపీలు ఏకగ్రీవం కాగా నెల్కి వెంకటాపూర్, గూడెం జీపీలు ఎస్టీలకు కేటాయించగా ఎవరూ లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు.

వందూరుగూడను నూతన జీపీగా మార్చడాన్ని నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరించడంతో మిగిలిన 24 జీపీలకు, ఖానాపూర్ నియోజక వర్గంలోని జన్నారం మండలంలోని 29 గ్రామ పంచాయతీలుండగా లింగయ్యపల్లి, లోతెర్రె జీపీలకు ఒక్కటొక్కటే నామినేషన్ లు దాఖలు కావడంతో ఈ రెండు జీపీలు ఏకగ్రీవమవడంతో 27 జీపీలకు ఎన్నికలు జరిగాయి. 81 గ్రామ పంచాయతీలకు 258 (దండేపల్లిలో 75, హాజీపూర్ లో 39, జన్నారంలో 98, లక్షెట్టిపేటలో 46) మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 816 (దండేపల్లిలో 278, హాజీపూర్ లో 106, జన్నారంలో 272, లక్షెట్టిపేటలో 160) వార్డులుండగా 268 (దండేపల్లిలో 103, హాజీపూర్ లో 22, జన్నారంలో 111, లక్షెట్టిపేటలో 32) వార్డులు ఏకగ్రీవం కాగా 34 వార్డులకు నామినేషన్ లు దాఖలు కాకపోవడంతో 514 (దండేపల్లిలో 143, హాజీపూర్ లో 84, జన్నారంలో 159, లక్షెట్టిపేటలో 128) వార్డులకు ఎన్నికలు జరిగాయి. 1476 (దండేపల్లిలో 435, హాజీపూర్ లో 219, జన్నారంలో 498, లక్షెట్టిపేటలో 324) మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 

నెమ్మదిగా ప్రారంభమైన పోలింగ్...

నాలుగు మండలాల్లో 1,24,019 (దండేపల్లిలో 38,532, హాజీపూర్ లో 16,954, జన్నారంలో 43,306, లక్షెట్టిపేటలో 25,227)  మంది ఓటర్లుండగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైనా ఓటు వేసేందుకు ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు దండేపల్లిలో 5,548(14.4 శాతం), హాజీపూర్ లో 3,176 (18.73 శాతం), జన్నారంలో 6,058 (13.99 శాతం), లక్షెట్టిపేటలో 5,794 (22.97 శాతం) ఓట్లు పోలయ్యాయి. నాలుగు మండలాల్లో 20,576 (16.59 శాతం) ఓట్లు పోలవగా తొమ్మిది గంటల తర్వాత ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలిరావడంతో ఉదయం 11 గంటల వరకు దండేపల్లిలో 17,845 (46.31 శాతం), హాజీపూర్ లో  9,167 (54.07 శాతం), జన్నారంలో 19,568 (45.19 శాతం), లక్షెట్టిపేటలో 14,026 (55.60 శాతం) అంటే 60,606 (48.87 శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు దండేపల్లిలో 28,520(74.01 శాతం), హాజీపూర్ లో  14,376 (84.79 శాతం), జన్నారంలో 32,584 (75.24 శాతం), లక్షెట్టిపేటలో 20,440 (81.02 శాతం) అంటే 95,920 (77.34 శాతం) ఓట్లు పోలయ్యాయి. 

ఓటర్లను వాహనాల ద్వారా తరలించిన అభ్యర్థులు...

ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు భరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు పోటాపోటీగా వాహనాల ద్వారా తరలించారు. గ్రామాల్లోని వాడల నుంచి ఆటోలలో కేంద్రాలకు తీసుకెళ్లారు. వృత్తి రీత్యా పట్టణాలలో ఉంటున్న, సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను తీసుకువచ్చేందుకు వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు కార్లను సమకూర్చి తీసుకువచ్చారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్లను ఆయా గ్రామాలకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో అభ్యర్థులు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు.

మండలం    మొత్తం ఓటర్లు        పోలైన ఓట్లు      

==================================

దండేపల్లి           38,532                   28,520 (74.02%)

హాజీపూర్            16,954                   14,376 (84.79%)

జన్నారం            43,306                  32,584 (75.24%)

లక్షెట్టిపేట          25,227                  20,440 (81.02%)

==================================

మొత్తం  :           1,21,656                 95,920 (77.34%)

==================================