calender_icon.png 11 December, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

11-12-2025 04:14:18 PM

జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న తొలివిడత సర్పంచ్ ఎన్నికలు..

ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి ఆదేశాలు..

నారాయణపేట (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా పరిధిలో జరుగుతున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్దూరు, కొత్తపల్లి, గుండుమల్లు, కోస్గి మండలాలలో ఎన్నికల సరళి, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్త్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ దొరేపల్లి, గుండుమల్, సజ్జఖన్ పేట్, ముశ్రీఫా, బోగారం తదితర పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా శాంతియుత వాతావరణం సర్పంచ్ ఎన్నికలు కొనసాగేలా చూడాలని అలాగే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ  సూచించారు. 

గ్రామ పంచాయతీ ఎన్నికలు సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఓటు వేయడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, క్యూ లైన్ లో ఉండేలా చూడాలని ఆయన తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీస్ విభాగం హై అలర్ట్‌లో కొనసాగాలని, శాంతి-భద్రతలను కాపాడడంలో ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యతగా ఉండాలని తెలిపారు నాల్గు మండలలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు.