calender_icon.png 16 November, 2025 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

01-12-2024 03:10:31 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30(విజయక్రాంతి) : ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31వరకు విదేశీ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన  మైనార్టీ విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఇలియాస్ అహ్మద్ తెలిపారు.

ఈ పథకం ద్వారా ప్రభుత్వం అర్హులైన విద్యార్థులకు రూ.2లక్షలు అందజేస్తుందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 1 నుంచి 31వరకు www.telanganaepass. cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సెండ్ చేయాలని సూచించారు.