calender_icon.png 16 November, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులకు అనుమతి

01-12-2024 02:58:47 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (విజయక్రాంతి): జీహెచ్ ఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి జారీచేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిషోర్ జీఓ నం ఎంస్ ఆర్టీ 611, 612, 613, 614ను జారీ చేశారు.

సరూర్‌నగర్ పెద్ద ట్యాంక్ తూము పునరుద్ధ్దరణ పనులు ఎస్‌ఎన్‌డీపీ కింద చేపట్టుటకు, బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద ఆర్వోబీ మరమ్మతులు, పునరావాస చర్యలకోసం.. లాంగ్వేజ్ అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంట్ వద్ద, ఐఎండీ వద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఇన్‌స్టాలేషన్, రాటిఫికేషన్ కోసం అనుమతు లు ఇస్తూ జీవోలను జారీ చేశారు.