01-12-2024 03:18:44 AM
వర్క్ ఫ్రం హోం పేరుతో రూ.1.29 లక్షల చోరీ
ఎల్బీనగర్, నవంబర్ 30: రోజుకో కొత్తకొత్త ఆలోచనతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. స్వయం ఉపాధి, అధిక వడ్డీ, ఉద్యోగం ఇప్పిస్తామని, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ అమాయకులను మభ్యపెట్టి, దొరికినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఎల్బీనగర్‌కు చెందిన మహిళ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో లక్షలు కాజేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీనగర్‌లో నివాసముంటున్న ఐత మౌనిక(23) ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తుండగా ఒక ప్రకటనకు ఆకర్షితులైంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెన్సిల్స్ ప్యాకింగ్ చేస్తూ రోజుకు వేలలో సంపాందించవచ్చని ప్రకటన సారాంశం. దీంతో మౌనిక వారు పేర్కొన్న వాట్సాప్ నంబర్‌లో సంప్రదించింది. మొదటగా రిజిస్ర్టేషన్ చేసుకోవాలని, ఇందుకు కేవలం రూ.620 చెల్లించాలని సూచించారు.
చిన్న మొత్తం కావడంతో ఆమె చెల్లించింది. అనంతరం మెటీరియల్ పంపడానికి రూ.2 వేలు పంపాలని అడిగారు. అలా విడుతల వారిగా ఆమె నుంచి రూ.1.29,913 కాజేశారు. ఆ తర్వాత వారి నుంచి స్పందన రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధతురాలు ఎల్బీనగర్ పీఎస్‌లో కంప్లుంట్ ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మోసపూరిత ప్రకటనలను చూసి మోసపోవొద్దని పోలీసులు సూచిస్తున్నారు.