calender_icon.png 1 May, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరఖాస్తులను పరిశీలించాలి

01-05-2025 12:32:16 AM

చేవెళ్ల , ఏప్రిల్ 30 : గ్రామాల్లో రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు పరిశీ లించి మండల పరిషత్ కార్యాలయంలో అం దజేయాలని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్యగౌడ్ సూచించారు. బుధవారం శంకర్పల్లి ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకయ్య పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకయ్యగౌడ్ మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాస్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను మే 1వ తేదీన వెరిఫికేషన్ చేసి ఆ యొక్క లిస్టును మండల కార్యాలయానికి అందజేయాలని సూచించారు. ఇప్పటివరకు దరఖాస్తులు ఇవ్వని లబ్ధిదారులు వెంటనే ఆయా గ్రామాల్లో ఉన్న గ్రామ కార్యదర్శులకు అందజేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.