24-09-2025 11:21:43 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పత్లాపూర్ గ్రామ శివారులో దాబా యజమాని బలిజ గంగాధర్, ఎటువంటి పర్మిషన్ లేకుండా 26 జూన్ 2025న తన దాబాలో మద్యం విక్రయాలు, సిట్టింగ్ నిర్వహించడం వల్ల పోలీసు లో దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. బిచ్కుందతహసిల్దార్ వద్ద దాబా నిర్వాహకుని బైండోవర్ చేశారు, 22 సెప్టెంబర్ 2025న అదే దాబాలో అక్రమ సిట్టింగ్ నిర్వహించగా, పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. మొదటి బైండోవర్ ను అతిక్రమించినందున, బుధవారం బిచ్కుంద ఎస్ఐ మోహన్ రెడ్డి, గంగాధర్ ను బిచ్కుంద తహసిల్దార్ వేణుగోపాల్ వద్ద బైండోవర్ చేశారు.
అతనికి జైలు శిక్ష తో పాటు రూ.50 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర మాట్లాడుతూ.జిల్లాలోని అన్ని దాబా యజమానులు వారి దాబాలలో మద్యం విక్రయాలు,సిట్టింగ్ లాంటి అక్రమ కార్య కలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. ఒకసారి బైండోవర్ చేసిన తరువాత మళ్లీ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే జరిమానాలు విధించడంతోపాటు కఠిన చర్యలు తప్పవు అని ఆయన హెచ్చరించారు. జిల్లాలోని దాబానిర్వాకులు గ్రహించాలని సూచించారు.