24-09-2025 11:26:05 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లి గ్రామంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి, శివుని విగ్రహం ఏర్పాటుకు గాను సర్పంచ్ ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు పడాల అజయ్ గౌడ్ బుధవారం నిర్మాణ పనులను సందర్శించి 11 వేల 116 రూపాయల విరాళాన్ని అందజేశారు. అంతేకాకుండా గర్రెపల్లి గ్రామంలో శివుని విగ్రహ నిర్మాణ పనులను సందర్శించి తన వంతు సహకారంగా పడాల అజయ్ గౌడ్ రూ.20వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పడాల అజయ్ గౌడ్ మాట్లాడుతూ... దుబ్బ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి మొత్తం గ్రానైట్ పనుల కోసం ఖర్చు అయ్యే లక్ష రూపాయలు రమ ఎంటర్ప్రైజెస్ సహకారంతో నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు.అజయ్ గౌడ్ వెంట పలువురు ఉన్నారు.