24-09-2025 11:35:13 PM
నకిరేకల్,(విజయక్రాంతి): మండలంలోని నోముల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి జాన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు ఆ పార్టీ మండల అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం సమక్షంలో నిర్వహించారు. ఉపాధ్యక్షుడిగా మాచర్ల శైలేష్, కోడదల లింగయ్య, ప్రధాన కార్యదర్శిగా కే. సంతోష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నర్సింగ్ వెంకన్న, కార్యదర్శులుగా నాగిళ్ల కిరణ్, గొలుసుల లింగయ్య, మాచర్ల రవి, కోశాధికారిగా ఎస్. కె. ఇమామ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జాన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు.