24-09-2025 11:40:36 PM
రెబ్బెన,(విజయక్రాంతి): భూపాలపల్లిలో బుధవారం జరిగిన కంపెనీ స్థాయి వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలలో బెల్లంపల్లి ఏరియా మహిళా ఉద్యోగులు పవర్ లిఫ్టింగ్ 57 kg విభాగంలో అనురాధ, 47 కిలోల విభాగంలో కోట్నక మమత గోల్డ్ మెడల్స్ సాధించి మొదటి స్థానం లో నిలిచి కోల్ ఇండియా పోటీలకు ఎంపికయ్యారు. బాడీ బిల్డింగ్, 75 కేజీ విభాగంలో జే.మొగిలి గోల్డ్ మెడల్ సాధించి అక్టోబర్ 14 నుండి 16 తేదీ వరకు నాగపూర్ వేదికగా జరిగే కోల్ ఇండియా స్థాయి పోటీలలో పాల్గొననున్నారు. తెలుసుకున్న జనరల్ మేనేజర్ విజయ్ భాస్కర్ రెడ్డి క్రీడాకారులని అభినందించారు. ఇదే స్ఫూర్తి ని కొనసాగించి కోల్ ఇండియాలో మళ్ళీ పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.