24-09-2025 11:49:26 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాలలో జాతీయ సేవా పథకం దినోత్సవన్ని బుధవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా. ఎస్. రమకాంత్ జాతీయ సేవా పథకం మాట్లాడుతూ... జాతీయ సేవా పథకం విద్యార్థుల్లో సేవా భావాన్ని పెంపొందించి, సమాజ అభివృద్ధికి తోడ్పడే దిశగా నడిపించే వేదిక. యువత జాతీయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించగలరని ఈ కార్యక్రమాల ద్వారా వారు గ్రహించాలి అని అన్నారు.