24-09-2025 11:17:30 PM
హనుమకొండ,(విజయక్రాంతి): సామాన్య ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు తీసుకురావడం సంతోషకరమని గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం వికాస్ నగర్ కాలనీ లో రోడ్ నెం. 23 వద్ద శ్రీ కృష్ణ క్లినిక్ ప్రారంభోత్సవం జరిగినది. ఈ ప్రారంభోత్సవ కార్య క్రమంలో 57వ డివిజన్ కార్పొరేటర్ నల్ల స్వరూప రాణి సుధాకర్ రెడ్డి, 59వ డివిజన్ కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డిల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.
అనంతరం గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలకు అందుబాటులోకి నిపుణులు అయిన డాక్టర్స్ చే వైద్యం అందించడం చాలా సంతోషకరణమని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవలను అందించాలని అభినందించారు. డాక్టర్ వంశీకృష్ణ అల్లం, డాక్టర్ సాయి శ్రీ అల్లంలు తమ స్వంత భవనంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నిరకాల వైద్యసేవలు అందిస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం శ్రీకృష్ణ క్లినిక్ యాజమాన్యం కార్పొరేటర్ దంపతులను శాలువాతో సన్మానించారు.