22-09-2025 05:39:52 PM
దౌల్తాబాద్: మండలంలోని మాచిన్ పల్లి గ్రామానికి రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శిని నియమించాలని గ్రామస్థులు జిల్లా పంచాయతీ అధికారిని కోరుతూ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. గ్రామానికి రెగ్యులర్ కార్యదర్శి లేకపోవడం వల్ల పలు సమస్యలు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న కార్యదర్శి వల్ల పంచాయతీ పనులు సక్రమంగా సాగడంలేదని గ్రామస్థులు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామస్తులకు అవసరమైన ధ్రువపత్రాల జారీ వంటి ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం, గ్రామ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగేందుకు తక్షణమే రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శిని నియమించాలని వారు డిమాండ్ చేశారు.