22-09-2025 06:44:19 PM
ఛత్తీస్‌ఘడ్: ఛత్తీస్‌ఘడ్(Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా మృతి చెందారు. ఎన్‌కౌంటర్ స్థలం నుండి ఒక ఏకే-47 రైఫిల్, ఆయుధాలు, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మృతిచెందిన మావోయిస్టుల పేరిట రూ. 40 లక్షల రివార్డు ఉంది.