calender_icon.png 22 September, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణికి 110 ఫిర్యాదులు

22-09-2025 06:14:11 PM

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం..

జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్..  

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 110 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్(District Collector Ashish Sangwan) తెలిపారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి పలువురు అర్జిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జిదారులకు న్యాయం చేసి తిరిగి అర్జి పెట్టుకోకుండా పని చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.