22-09-2025 05:59:46 PM
ఆ లోపు మిగతా ఇళ్ళు కూడా కూల్చుతామనడం బాధాకరం
గాజులరామారం బాధితులకు భరోసా ఇచ్చిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): 6వ తేదీలోపు ఇక్కడ నివాసం ఉంటున్న పేదలను ఖాళీ చేయమని హైడ్రా వార్నింగ్ ఇవ్వడం చాలా బాధాకరమని, ఆలోపు బాధితులకు డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం సర్వే నెంబర్ 307 లో ఆదివారం హైడ్రా ఇళ్లను కూల్చివేసిన విషయం తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం నర్సింహ బస్తీ, బాలయ్య బస్తీలలో సందర్శించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... ప్రభుత్వ భూముల కబ్జాలలో ఎవరి పాత్ర ఎంతుందో అంతా తెలుసు, కానీ టైం వచ్చినప్పుడు అన్నీ వెల్లడిస్తానని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పేదలు ఇక్కడ నివాసం ఉంటున్నారని, ఉన్నఫలంగా వారు నివాసముంటున్న ఇళ్లను హైడ్రా కూల్చివేసి రోడ్డున పడేసారని మండిపడ్డారు. మరోసారి పేదల ఇళ్లను కూల్చితే తానే స్వయంగా వచ్చి జేసీబీల ముందు నిలబడి,అడ్డుకుంటానని భరోసా ఇచ్చారు.