22-09-2025 05:54:08 PM
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి..
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని సంగెం గ్రామంలోని ధాన్య లక్ష్మి రైస్ మిల్లులో జరిగిన అవకతవకల గురించి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy)పై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి అన్నారు. సోమవారం వలిగొండ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లులో కొంతమంది భాగస్తులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అండదండలతో చేశాడని చేస్తున్న ఆరోపణలు, ప్రచారాలు తప్పని వెంటనే మానుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణల విషయంలో స్పందించనట్లయితే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిప్పులాంటి మనిషి అని అవినీతి, అక్రమాలు అసలు సహించడని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.