22-09-2025 05:39:44 PM
గతంలో మృతి చెందిన కార్మికుడికి నష్టపరిహారం ఇవ్వలేదంటూ ఆగ్రహించిన తోటి కార్మికులు..
ఫ్యాక్టరీ ఆఫీస్ పై దాడి, ఫర్నిచర్ ధ్వంసం..
పరిస్థితిని అదుపు చేయబోయిన పోలీసులు, వాహనాలపై రాళ్ల దాడి..
సూర్యాపేట (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం మహంకాళి గూడెం గ్రామ సమీపంలో ఉన్న దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా తయారయింది. ఇటీవల ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తూ బీహార్‌కు చెందిన ఓ కార్మికుడు మృతి చెందాడు. అయితే నష్టపరిహారం ఇస్తామని చెప్పి మేనేజ్మెంట్ మాట తప్పడంతో బీహార్ కార్మికులు ఆగ్రహించారు. దీంతో ఆఫీస్‌పై దాడికి దిగి అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పోలీసులకు సమాచారం అందగా పరిస్థితి అదుపు చేసేందుకు వెళ్లడంతో తీవ్రంగా ఆగ్రహించిన కార్మికులు వారిపై కూడా దాడికి దిగి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. తదుపరి దాడికి దిగిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మొత్తం మీద పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది.